Sye Raa Download: ఆన్ లైన్‌లో ‘సైరా’ ఫుల్ మూవీ.. మళ్లీ వాళ్లపనే
Sye Raa Narasimha Reddy Leaked Online: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా నరసింహారెడ్డి’కి తొలిరోజు బిగ్ షాక్ తగిలింది. విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే సినిమా మొత్తాన్ని ఆన్ లైన్‌లో లీక్ చేసింది తమిళ్ రాకర్స్.

చిరంజీవి
తాజాగా మెగాస్టార్ ‘సైరా’ చిత్రాన్ని సైతం పైరసీ భూతం కమ్మేసింది. భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ నేడు (అక్టోబర్ 2) విడుదలైన ఈ మూవీని ఆన్ లైన్‌లో లీక్ చేసేశారు. పెద్ద చిత్రాలను చెప్పి మరీ లీక్ చేస్తున్న తమిళ్ రాకర్స్ మరోసారి పంజా విసిరింది. ‘సైరా’ సినిమా ఫస్ట్ షో పూర్తయ్యేసరికే సినిమా మొత్తాన్ని హెచ్ డీ ఫ్రింట్‌తో ఆన్‌లైన్‌లో లీక్ చేసేసింది.
ఇక థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడకుండా ఆన్ లైన్‌లో లింక్‌ల కోసం ఎదురుచూసే కొంతమంది ఈ సినిమా లింక్‌లను షేర్ చేస్తుండటంతో నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. కొంతమంది పనికట్టుకుని ఈ పైరసీ లింక్‌లను షేర్ చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. చాలాచోట్ల నుండి ఫిర్యాదులు అందటంతో నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని.. పైరసీ లింకులు కనిపిస్తే syeraaantipiracy@gmail.comకి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఆన్ లైన్‌లో చాలా లింక్స్‌ను తొలగించారు.
ఇక పైరసీ లింక్స్ మాత్రమే కాకుండా.. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘సైరా’ చిత్రంలోని కీలకమైన సన్నివేశాలను ఫోన్‌లో రికార్డ్ చేసి షేర్ చేస్తున్నారు. కొంతమందైతే ఫేస్ బుక్, వాట్సాప్, ఐఎమ్ఓలలో డైరెక్ట్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేస్తున్నారు. థియేటర్స్‌లో ఫోన్స్ అనుమతించడం, సరైన నిఘా లేకపోవడంతో ఈ లీక్‌ల బెదడ సినిమా విడుదలైన ప్రతిసారి ఎదురౌతూనే ఉంది.
No comments:
Post a Comment