ఈ 15 ఆండ్రాయిడ్ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే తొలగించండి !

మీది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఫోన్ అయితే ఇప్పుడు చెప్పబోతున్న 15 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఒకవేళ మీ ఫోన్ లో ఉంటే వెంటనే తొలగిస్తే సమస్య ఉండదు.
ఒక ప్రముఖ యాంటీవైరస్ సంస్థ Sophos గూగుల్ ప్లే స్టోర్ లో రహస్యంగా చాలా కాలం నుండి దాగి ఉన్న 15 ప్రమాదకరమైన అప్లికేషన్స్ గురించి తాజాగా వివరాలు బయట పెట్టారు. తెలిసిన తెలియకపోయిన వీటిని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే, వెంటనే ఆ అప్లికేషన్స్ వాటికి సంబంధించిన అప్లికేషన్ ఐకాన్స్ అన్ని అప్లికేషన్స్ డ్రాయర్‌లో కనిపించకుండా రహస్యంగా దాచి పెడతాయి. అలా అప్లికేషన్ ఐకాన్ కనిపించక పోయిన కూడా అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. యూజర్లు సులభంగా గుర్తించకుండా ఇదొక ప్రత్యేకమైన సిస్టమ్ నేమ్‌తో రహస్యంగా దాగి ఉంటుంది.
ఒక అప్లికేషన్ ఐకాన్ మనకు కనిపించికపోతే... అసలు ఆ అప్లికేషన్ ని ఎలా తొలగించాలో కూడా చాలా మందికి తెలియదు. సరిగ్గా ఇ విషయాన్ని ఆసరాగా చేసుకుని ఫోన్ లోకి వచ్చిన ఈ పదిహేను అప్లికేషన్లు కనిపించకుండా దాగి ఉంటున్నాయి. అంతే కాదు ఒక సారి ఫోన్ లోకి ప్రవేశించిన తర్వాత, ఇవి బ్యాక్ గ్రౌండ్ లో ఫోన్ స్లో చేయడంతో పాటు, అనేక ఇతర ప్రమాదకరమైన పనులు చేస్తాయి.

ఈ అప్లికేషన్ల జాబితాను చూసి.. ఈ క్రింద ఇవ్వబడిన స్క్రీన్ షాట్స్ లో ఉన్న అప్లికేషన్స్ ఒకవేళ మీ ఫోన్లో ఉంటే , దానిలో డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసి , బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న అప్లికేషన్స్ జాబితా చూసి , వాటిని బలవంతంగా క్లోజ్ చేయాలి, ఫోన్ నుండి తొలగించడం కూడా చేయవచ్చు. ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్స్ తో పాటు, యాంటీథెప్ట్ అప్లికేషన్స్ కూడా దీంట్లో ఉండటం గమనించాలి .

ప్రమాదకరమైన అప్లికేషన్స్ గూగుల్ ప్లే స్టోర్ లోకి రాకుండా గూగుల్ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్న కూడా గూగుల్ కళ్ళు కప్పి కొన్ని ఇలాంటి యాప్స్ ప్రవేశిస్తున్నాయి.
No comments:
Post a Comment