Coffee Today

Sunday, October 20, 2019

Low Budget Mobile s

48 మెగా పిక్సెల్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. ధర మాత్రం బడ్జెట్ లోనే!

 | Updated: 19 Oct 2019, 01:40 PM
samayam-telugu
   

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే అదిరిపోయే ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హువావే ఎంజాయ్ 10 పేరిట ఈ ఫోన్ చైనాలో అధికారికంగా లాంచ్ అయింది. ఇందులో 48 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా, పంచ్ హోల్ సెల్పీ కెమెరాతో కూడిన డిస్ ప్లే కూడా ఉండటం విశేషం.
దీపావళికి Vivo బంపర్ ఆఫర్.. రూ.101 కట్టి మొబైల్ తీసుకెళ్లండి!
ధర ఎంత?
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,199 యువాన్లు(సుమారు రూ.12,000)గా ఉండగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ల ధరను 1,399 యువాన్లు(సుమారు రూ.14,000)గా నిర్ణయించారు. హువావే ఎంజాయ్ ఫోన్ కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు చైనాలో ఇప్పటికే ప్రారంభం కాగా, అమ్మకాలు నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఫోన్ యాసిషియా రెడ్, అరోరా బ్లూ, బ్రీతింగ్ క్రిస్టల్, మ్యాజిక్ నైట్ బ్లాక్ రంగుల్లో లభించనుంది.

Nokia నుంచి అద్భుతమైన ఫీచర్ ఫోన్.. ఎంతో తెలుసా?

స్పెసిఫికేషన్లు, స్పెషల్ ఫీచర్లు ఏంటి?
ఇందులో 6.39 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే అందుబాటులో ఉంది. పంచ్ హోల్ డిస్ ప్లేతో విడుదలైన ఈ ఫోన్ లో స్క్రీన్ టు బాడీ రేషియో 90.15 శాతంగా ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 720x1560 పిక్సెల్స్ గా ఉంది. ఆక్టాకోర్ హై సిలికాన్ కిరిన్ 710ఎఫ్ ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ పని చేయనుంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా ఫోన్ స్టోరేజ్ ని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికి వస్తే, ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా అపెర్చర్ f/1.8గా ఉంది. 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న డెప్త్ సెన్సార్ ను కూడా ఇందులో అందించారు. దీని అపెర్చర్ f/2.4గా ఉంది. సెల్పీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను అందించారు. దీని అపెర్చర్ f/2.0. బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్ గా ఉంది. ఫోన్ లో ఉండే ఫైల్స్ ట్రాన్స్ ఫర్ కోసం యూఎస్ బీ పోర్ట్ ను అందించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న అన్ని ఫోన్లలో ఉన్న ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లను ఇందులో హువావే అందించలేదు.

మార్కెట్లోకి Vivo Y11 2019.. బ్యాటరీ 5000 ఎంఏహెచ్.. మరి ధర?

ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ఈఎంయూఐ 9.1పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో డ్యూయల్ సిమ్ కార్డు ఫీచర్ ఉంది. రెండు నానో సిమ్ లను ఇందులో ఉపయోగించవచ్చు. ఇంకా ఇందులో వైఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.0 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ పొడవు 15.68 సెంటీ మీటర్లు కాగా, వెడల్పు 7.61 సెంటీమీటర్లు గానూ, మందం 0.81 సెంటీమీటర్లు గానూ ఉంది. ఇక దీని బరువు 176 గ్రాములు.

No comments:

Post a Comment