Coffee Today

Saturday, October 12, 2019

9 Tipes of CANCERS

తొమ్మిది రకాల క్యాన్సర్లు వాటి గురించి అవగాహన
ఫిబ్రవరి 4వ తేదీన వరల్డ్ కాన్సర్ డే గా ప్రజలలో కాన్సర్ పట్ల అవగాహనా పెంచటానికీ జరుపుకుంటారు. ఈ సందర్బంగా కాన్సర్ వ్యాధి ఎన్ని రకాలు వాటిని ముందుగా ఎలా గుర్తించి జాగ్రత్త పడవచ్చు తెలుసుకుందాం.
తొమ్మిది రకాల క్యాన్సర్లు.
కోలన్ (పెద్దపేగు )కాన్సర్ : పాశ్చత్య దేశాలలో అతిప్రమాదకారిగా పేరుపొందినది ఇదే. ఈ వ్యాధి లో పెద్దప్రేగు లేదా పెద్దప్రేగు. అయిన పురీషనాళం లోపల భాగములో పెరుగుదల కనిపిస్తుంది ఈవ్యాధిని మొదటి దశలో గుర్తించడం డాక్టర్లకు చాలా సులభం
credit: third party image reference
ఒవేరియన్ (అండాశయ )కాన్సర్ : సాదారణంగా 50ఏళ్ళు దాటినా ఆడవారిలో అండాశయంలోని కణజాలంలో ఈ రకం కాన్సర్ కనిపిస్తుంది చాలా అరుదుగా యువతులలో కూడా ఈ వ్యాధి కనిపించవచ్చు
స్కిన్ (చర్మ )కాన్సర్ : ఈ కాన్సర్ ముందు శరీర ఉపరితలంపై ప్రభావం చూపి క్రమముగా ఇతర భాగాలకు ప్రాకుతుంది
బ్రెస్ట్ (స్తనాల )కాన్సర్ : ముందు ప్రారంభ దశలో ఆడవారి నొప్పిలేని గడ్డలుగా మొదలవుతుంది క్రమముగా లోపలి భాగాలకు వ్యాప్తి చెందుతుంది
credit: third party image reference
ఊపిరితిత్తుల (లంగ్ )కాన్సర్ : ఈ వ్యాధి ప్రమాదకరమైనది ప్రాణంతాకమైనది ఇది ఆడ మగ తేడా లేకుండా అందరికి వస్తుంది దీనికి ముఖ్య కారణం పొగాకు దానికి సంబందించిన ఉత్పత్తులు సెగరెట్ వంటివి
జీర్ణాశయ (స్టమక్ )కాన్సర్ : జీర్ణాశయ లోపలి భాగములో పెరుగుదల కనిపించి క్రమముగా లింప్ నోడ్స్ ఇతర భాగాలకు అంటే జీర్ణాశయానికి దగ్గరగా వుండే అవయవాలకు వ్యాపించటం ఈ వ్యాధి లక్షణం
నోటి (మౌత్ )కాన్సర్ : నోటిలో పెదాలపై చిగుళ్లపై అదే విధముగా లాలాజలగ్రంధులపై పెరుగుదల కనిపించుట ఈ వ్యాధి లక్షణం దీనివల్ల లింప్ వ్యవస్థ దెబ్బతింటుంది ఊపిరితిత్తులు కూడా దీని ప్రభావానికి లోనవుతాయి
త్రోట్ (గొంతు) కాన్సర్ : స్వర తంతులపైనా గొంతు లోపలి భాగంలో కనిపించే పెరుగుదలలు ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు ఈ పెరుగుదలలు గొంతు నుండి అన్నవాహిక లింప్ నోడ్ లకు వ్యాపిస్తుంది
credit: third party image reference
ప్రోస్టేట్ (పౌరుష గ్రంధి )కాన్సర్ : సాధారణంగా 60సవత్సరాలు పైబడిన మగవారిలో కనిపించే కాన్సర్ ఇది నిజానికి ప్రోస్టేట్ గ్రంథిలో కనిపించే మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ప్రోస్టేట్ గ్రంధి అనేది పురుష ప్రతుత్పత్తిలో ఒక అనుబంధ గ్రంధి

No comments:

Post a Comment