Coffee Today

Sunday, October 6, 2019

About of Tollywood Hero GOPICHAND.

విధి వక్రిస్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది!
థానాయకుడిగా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత విలన్‌ పాత్రలకైనా సై అంటూ కళ్లల్లో క్రౌర్యాన్ని పలికించి.. తిరిగి మాస్‌, యాక్షన్‌ హీరోగా నిలదొక్కుకున్న నటుడు గోపీచంద్‌. జీవితంలో ఒడిదొడుకులను తట్టుకుంటూ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందాలని తపించిన ఆయన చివరికి అనుకున్నది సాధించారు. ప్రతినాయకుడి పాత్రలో గుర్తింపు పొంది, తన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పొందారు. నటుడిగా గతేడాది 25 చిత్రాల మైలురాయిని అందుకున్న ఆయన ఇప్పుడు స్పై థ్రిల్లర్‌ ‘చాణక్య’తో మరో అడుగు ముందుకు వేశారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎలా కష్టపడిందీ ఒక సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు గోపీచంద్‌.
సినిమాల్లోకి రావాలనుకోలేదు!
విధి వక్రిస్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది!
2001లో ‘తొలివలపు’ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు గోపీచంద్‌. అయితే ఆయన సినిమాల్లోకి రావాలని అనుకోలేదట! ‘‘నేను సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న టి.కృష్ణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆయన క్యాన్సర్‌ కారణంగా మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. అన్నయ్య ప్రేమ్‌చంద్‌కు దర్శకత్వం అంటే ఇష్టం. ముత్యాల సుబ్బయ్యగారి వద్ద అసిస్టెంట్‌ దర్శకుడిగా చేరాడు. సొంతంగా సినిమా చేసే అవకాశం కూడా వచ్చింది. అయితే, అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వారి కృషిని నేను కొనసాగించాలని అనుకున్నా. అందుకే సినిమాల్లోకి రావాలనుకున్నా’’ 
సినిమాలా... బిజినెస్‌ చేసుకో!
విధి వక్రిస్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది!
సినిమా హీరో అవుదామని ప్రయత్నాలు మొదలు పెట్టిన గోపీచంద్‌కు మొదట అవాంతరాలే ఎదురయ్యాయి. ‘‘అనుకున్నవన్నీ జరిగితే అది జీవితమెలా అవుతుంది. సినిమా హీరోనవుదామని నాన్నగారి స్నేహితుడైన పోకూరి బాబూరావుని కలిశా. ‘సినిమా అంటే కోట్లలో వ్యవహారం ఒక్కసారి దెబ్బ తగిలితే కోలుకోలేం. కాబట్టి ఏదైనా బిజినెస్‌ చేసుకో’ అని ఆయన సలహా ఇచ్చారు. ఆ మాటలు నా ఉత్సాహాన్ని నీరుగార్చాయి. ఇక లాభం లేదనుకుని టి.కృష్ణ మెమోరియల్‌ బ్యానర్‌ సారథి మోపర్తి నాగేశ్వరరావుని కలిశా. ఆయనా అదే మాట చెప్పారు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్యగారి దగ్గరకు తీసుకెళ్లారు. మోపర్తి నాగేశ్వరరావు నిర్మాతగా ‘తొలివలపు’ చేశా. హీరోనయ్యా.. కానీ సినిమా ఆడలేదు’’
‘ఫ్లాఫ్‌తో వెళ్లిపోయాడు’ అంటారేమోనని భయపడ్డా!
విధి వక్రిస్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది!
‘‘తొలివలపు’ ఫ్లాప్‌తో  మళ్లీ నిస్తేజం. ఓ ఏడాది పాటు గ్యాప్‌ వచ్చింది. ఈ సమయంలో ఎంతో సంఘర్షణకు లోనయ్యా. ఒక దశలో ఫీల్డ్‌ నుంచి వెళ్లిపోదామనుకున్నా. అలా వెళ్లిపోతే, ‘ఫ్లాఫ్‌తో వెళ్లిపోయాడు’ అంటారు. దీంతో నాలో కసి పెరిగింది. ఎలాగైనా సరే సక్సెస్‌ అయి చూపించాలనుకున్నా. దాని కోసం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించా’’
రోజూ తేజకు ఫోన్‌ చేస్తే...
విధి వక్రిస్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది!
‘‘దర్శకులు తేజ మా నాన్నగారి వద్ద ‘దేవాలయం’, ‘వందేమాతరం’ చిత్రాలకు అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా పనిచేశారు. నాకూ ఆయనతో పరిచయం ఉంది. ఆయన సినిమాల్లో అవకాశం కోసం రోజూ ఫోన్‌ చేసేవాడిని. ‘నువ్వు ఇలా రోజూ ఫోన్‌ చేయొద్దు. ఏదో ఒకరోజు నేనే నిన్ను పిలుస్తా’ అని ఆయన చెప్పారు. అనుకోకుండా ఒక రోజు ఆయన నుంచి పిలుపు రానే వచ్చింది. ‘జయం’ సినిమాలో విలన్‌గా చేయాలని నన్ను అడిగారు. నా లక్ష్యం మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం. అంతేకానీ, అది హీరోగానా, విలన్‌గానా అని కాదు. తేజగారి మీద నమ్మకంతో వెంటే ఒప్పుకొన్నా. ఆ నిర్ణయమే నా కెరీర్‌లో పెద్ద మలుపుగా నిలిచింది. మీరు చూశారో లేదో.. ‘జయం’లో నా నటలో ఒక కసి కనిపిస్తుంది. ఎలాగైనా ఎదగాలనే తపన కనిపిస్తుంది. ఆ సినిమాలో నేనే హీరోనన్నంతగా ఇన్‌వాల్వ్‌ అయి నటించా. ఆ ఏడాదికి ఉత్తమ విలన్‌గా నంది అవార్డునూ అందుకున్నా. ఆ తర్వాత ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో నటనకు మంచి మార్కులు పడ్డాయి’’ 
ఆనాటి మచ్చ అలా పడింది
విధి వక్రిస్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది!
‘‘చిన్నప్పుడు హోం వర్క్‌ సరిగా చెయ్యకపోతే ‘ముక్కు కోసి పప్పులో పెడతా’ అని స్కూల్‌ టీచర్లు అనేవారు. అసలు ముక్కును ఎలా కోస్తారా చూద్దామంటూ మా అన్నయ్య ప్రేమ్‌చంద్‌ ఒక రోజు బ్లేడ్‌ తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. నేను చూస్తుండగానే నా ముక్కుపై బ్లేడ్‌తో కోశాడు. నొప్పి భరించలేక నేను కేకలు వేసే సరికి అన్నయ్య పారిపోయాడు. చాలా రక్తం పోయింది. అప్పటి నుంచి అది జ్ఞాపకంగా ఆ మచ్చ నా ముఖంపై అలా నిలిచిపోయింది’’
విధి వక్రిస్తే ఎలా ఉంటుందో తెలిసింది
విధి వక్రిస్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది!
‘‘నేను రష్యాలో ఇంజినీరింగ్‌ చేస్తున్నప్పుడు అన్నయ్య చనిపోయాడు. అప్పుడు అన్నయ్యకు 22ఏళ్లు. ఇండియా వచ్చేందుకు నాకు వీసా దొరకలేదు. అన్నయ్య అంత్యక్రియలకు కూడా రాలేకపోయా. ఆ తర్వాత పదినెలలకు వచ్చా. విధి వక్రిస్తే ఎంత దుర్భరంగా ఉంటుందో అప్పుడు తెలిసింది. నాన్న, అన్నయ్య ఇద్దరూ మమ్మల్ని వదిలి వెళ్లడంతో ఎన్ని ఉన్నా ఏదో వెలితి మమ్మల్ని వెంటాడింది. ఇంత బాధనూ దిగమింగుకొని మా అమ్మ మా సంతోషం కోసం పాటుపడింది’’
బిజినెస్‌ చేసుకునేవాడినేమో
విధి వక్రిస్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది!
‘‘సినిమాల్లోకి రాకుండా ఉంటే బిజినెస్‌ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక్కడ ఎవరి స్థానమూ శాశ్వతం కాదు. అలాంటప్పుడు దీన్నే పట్టుకుని కూర్చోవడం కూడా భావ్యం కాదు. గోపీచంద్‌ అంటే మంచి నటుడుగా ప్రేక్షకులంతా గుర్తుంచుకోవాలన్నదే నా తపన. ఇప్పటివరకూ నా కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు ఇచ్చారు’’ 
ఆసక్తులు.. అభిరుచులు
విధి వక్రిస్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది!
అభిమాన నటులు: ఎస్వీ రంగారావు, అమితాబ్‌ బచ్చన్‌
అభిమాన నటి: మధుబాల, జయసుధ
నచ్చే చిత్రం: గాడ్‌ ఫాదర్‌  
స్నేహితులు: చాలా మంది ఉన్నారు. కలిసి సినిమాలకి వెళ్తుంటాం. రాత్రిపూట పార్టీలకి కాస్త దూరంగా ఉంటా.
ఇష్టమైన వంటకం: చికెన్‌ వెరైటీలు ఏవైనా ఇష్టమే 
ఫిట్‌నెస్‌ రహస్యం: రోజూ కనీసం 45 నిమిషాలైనా జిమ్‌లో గడుపుతాను. వేళకి భోజనం చేస్తుంటాను.
మలుపు: జయంలో విలన్‌గా నటించడం.
కోరుకునే దుస్తులు: బ్లూ జీన్స్‌, వైట్‌ షర్టు.
ప్రేమంటే: తొలిచూపులో కలిసే ప్రేమపై నాకు నమ్మకం లేదు. అది కేవలం ఆకర్షణ మాత్రమే. కొన్ని రోజులు కలిసి మాట్లాడుకున్నాక మాత్రమే ప్రేమ పుడుతుంది.
ఖాళీ సమయాల్లో: సినిమాలతో, స్నేహితులతో టైంపాస్‌
మీలో ప్లస్‌ పాయింట్‌: ఏ పనైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసం
మీలో మైనస్‌ పాయింట్‌: అందర్నీ త్వరగా నమ్మేయడం

No comments:

Post a Comment