Coffee Today

Sunday, September 29, 2019

Lady Heros ..

సినీ పరిశ్రమలో లేడీ' హీరోలు ' - వాళ్ళకోసమే సినిమా ' కథలు '...
చిత్ర పరిశ్రమ అంటే హీరోలకే అగ్రతాంబూలం అంటారు. ఇంతకు ముందు సినీ కధంతా హీరోల చుట్టూనే తిగిగేది. ఎక్కువ స్క్రీన్, సమయం వారికే సొంతం. హీరోయిన్లు పాటలు, గ్లామర్ కు పరిమితి అయ్యేవారు. కానీ విషయాలన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. తారల ప్రాధాన్యం పెరుగుతున్నది. పారితోషికాలు హీరోలతో సమానంగా వుంటున్నాయి. అటువంటి తారల ప్రపంచం లోకి వెళ్తే....

విద్యాబాలన్ - హీరోయిన్ ఓరియేంటేడ్ పాత్రల విషయంలో ముందు వరసలో వుంది. పదేళ్లనాటి ' ఫా ' లో, ఆ తరవాత ' ఇస్కియా ' లో,' నోవన్ కి ల్డ్ జెస్సికా ' లో బయోపిక్, ' కహానీ ', ' ది డర్టీ పిక్చర్ 'లో విద్య విరజిమ్మిన నటనా సౌరభాలను పరిశ్రమ, ప్రేక్షకులు మరువలేరు.

కంగనా రనౌత్ - ' క్వీన్ ' గా ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఆమె తొలి ముద్దు, నటనా, మరెన్నో అంశాలు వాస్తవికతకు దర్పణం పట్టాయి. ప్రేక్షకులని కళ్లార్పనీయలేదు. ' తను వెడ్స్ మను ' రిటన్స్ లో రెండు పాత్రలు చేసింది. హర్యాని ఎథ్లేట్ గా, వివాహితుడితో ప్రేమలో పడిన పాత్రలో ఒదిగిపొఇంది. ఆమె నడవడిని, భాష, మేనరిజం, వంటివన్నీ తిరుగులేని పెర్ఫక్షన్ తో ఊపేసాయి. ' మణికర్ణిక ' : ది క్వీన్ అఫ్ ఝాన్సీ' వివాదాలకు గురైనా. మడమతిప్పని ధీర వనిత. దర్శకుడు వదిలేస్తే, ప్రాజెక్టుని తన భుజాలపై మోసింది.

అలియాభట్ - పరిశ్రమలో చిన్నదే అయినా పెద్ద గుర్తింపు పొందింది. రెండో సినిమా ' హైవే ' లో బోల్డ్ ఛాయిస్ లు తీసుకుంది. బాల్యంలో అగాయిత్యాలకు గురైనా అమ్మాయిగా చూపరుల్ని తన ప్రతిభతో దిగ్భ్రాంతుల్ని చేసింది. ' ఉడతా పంజాబ్ ' అలియా మేక్అప్ మరువలేనిది. ' రాజి ' లో అండర్ కవర్ ఏజెంట్ గా తిరుగులేని పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ' గుల్లి భాయ్ ' లో మరో అవతారం. ఇలా తనకంటూ ప్రతి చిత్రంలో తన కంటూ ప్రత్యేకత చాటుకుంది. 
దీపికా పదుకునె - ' కాక్ టైల్ ' లో బ్యాడ్ గాళ్ గా తెర పైన కనబడిన దీపికా ను చూసి ప్రేక్షకులు నమ్మలేకపోయారు. ' పై ఎండింగ్ ఫన్నీ ' లో వితంతుపాత్ర. సహజంగా నటించింది.' పీకు ' లో సింగిల్ స్టేటస్ యువతిగా కెరీర్ కు మరింత ఊపు వచ్చింది. ఆమె జీవితం ఎందరో యువతులకు దర్పణం అయ్యిన్ది . 'బాజీరావ్ మస్తానీ ' లో ప్రియురాలిగా, వీర యువరాణి గా చెరగని ముద్రలు వేసింది. ' పద్మావత్ ' లో మరో అదర్ - బ్యాక్ రోల్ దీపికను అందలం ఎక్కించాయి . 
తాప్సి పన్ను - దక్షిణాది పట్ల కోపాన్ని వ్యక్తంచేస్తూ, బాలీవూడ్ లోకి ' చెస్మి బద్దూర్ ' తో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె హాస్యం విజయాన్ని పండించింది. దక్షిణాది ఇవ్వలేని ఊపును ఉత్తరాది అందించిందని ఆనందపడింది. ' బౌజీ ' లో అండర్ కవర్ ఏజెంట్ గా నటించింది. తర్వాత ' నామ్ షబానా ' ఈ రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే.'మన్మజియాన్ ' మరో విభిన్న చిత్రం. సైకలాజికల్ థ్రిల్లర్ ' బద్లా ', తాజా ' గేమ్ ఓవర్ ' తాప్సి కెరీర్ లో ఉత్తమ చిత్రాలు.

సోనంకపూర్ - ఈ పాసనిస్తా సంజయ్ లీల భన్సాలీ సినిమా ' సావరియా ' తో 2007లో కెరీర్ కు శ్రీకారం చుట్టింది. ' రాన్ ఝానా ' లో సరికొత్త రూపంతో, ప్రతీకారంతో రగిలిపోయే అమ్మాయిగా కెరీర్ లో మరువలేని ముద్రలు వేసింది. ' నీర్జా ' ఆమె కెరీర్ లో ఉత్తమ చిత్రం. ప్రయాణికుల క్షేమం కోసం ప్రాణాలు ఒడ్డిన హోస్టెస్ పాత్రలో జీవించింది. ' ఏక్ లడకీ కొ దేఖా తో ఐసా లగా ' కెరీర్ లో పెద్ద రిస్కు తీసుకుని లెస్బియన్ గా నటించింది. 
రాధికా ఆప్టే - ' వాష్ ! లైఫ్ హొతో ఐసి ' లో చిన్న పాత్రలో కెరీర్ కు శ్రీకారం చుట్టిందిరాధికా. ' షోర్ ఇన్ ది సిటీ ' లో పూర్తీ స్థాయీ పాత్ర చేసింది. ' బద్లా పూర్ ' లో చిన్నదే అయినా గుర్తింపు గల పాత్ర. ' హంటర్ ',' పర్చేడ్ ', ' పాడ్ మాన్ ', 'లస్ట్ స్టోరీస్ ' వంటి సినిమాల్లో తనకంటూ ప్రత్యేకత నిలుపుకుంది.

No comments:

Post a Comment