Coffee Today

Tuesday, September 24, 2019

BYJU'S THE LEARNING APP.

బైజుస్ది.. లెర్నింగ్ యాప్ ఈ అప్ గురించి up ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేస్తారు.. !!
‘బైజుస్’ భారతదేశం యొక్క అతిపెద్ద K – to – 12 ఎడ్యుకేషన్ లెర్నింగ్ యాప్. దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయుల నుండి యానిమేటెడ్ వీడియో పాఠాలు అందించే ఒక ఆన్ లైన్ వేదిక. JEE, NEET, CAT, IAS, GRE మరియు GMAT లాంటి పోటీ పరీక్షలకు అభ్యాస కార్యక్రమాలు అందించే అతిగొప్ప విద్యాసంస్థ. ఇప్పటివరకు 2.5 కోట్లకు పైగా డౌన్లోడ్లను సాధించిన ఏకైక ఎడ్ టెక్ స్టార్టప్.
credit: third party image reference
బైజుస్ ఉపయోగాలు….
ముఖ్యంగా 4 వ తరగతి విద్యార్ధుల నుండి 12th గ్రేడ్ విద్యార్ధుల వరకు వారికి అవసరమైన అన్ని సబ్జెక్టులు మరీ ముఖ్యంగా మాథ్స్ మరియు సైన్స్ సబ్జెక్టుల సాధనకు బైజుస్ చక్కగా ఉపయోగపడుతుంది. BYJU యొక్క రాక్ స్టార్ R & D బృందం రూపొందించిన వీడియో పాఠాలు వివరణాత్మకంగా అర్ధమయ్యే రీతిలో ఉంటాయి. ప్రతి విద్యార్ధి యొక్క అభ్యసన అవసరానికి అనుగుణంగా ప్రాక్టీస్ పరీక్షలు ఉంటాయి. విద్యార్ధి స్వీకరించిన లెర్నింగ్ మార్గాల ఆధారంగా ఒక లోతైన విశ్లేషణకు ఈ యాప్ సహాయపడుతుంది. అలాగే విద్యార్ధి యొక్క పనితీరును మరియు ప్రణాళికను మెరుగుపరచు కోవడానికి వివరణాత్మకమైన విశ్లేషణను అందిస్తుంది. ప్రతి మాడ్యూల్ అందించే రివిజన్ మరియు ప్రాక్టీస్ సెషన్స్ ద్వారా విద్యార్థులకు వారి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సహాయం చేస్తుంది. అదే విధంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి నిపుణుల ద్వారా వారికి అవసరమైన అన్ని రకాల టెస్ట్ సిరీస్ లను అందించి వారికి తగిన విధంగా మాక్ టెస్ట్ లను నిర్వహిస్తోంది. ముఖ్యంగా IAS కి ప్రిపేర్ అయ్యేవారికోసం ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కు అవసరమైన ఉపాయాలను, చిట్కాలను IAS టాపర్ల నుండి అందిస్తుంది. అప్డేట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్, వీక్లీ కరెంట్ అఫైర్స్ క్విజ్ లతో పాటు అన్ని అంశాలపై సాధారణ మరియు నిమగ్నమైన వీడియో ఉపన్యాసాలను అందిస్తుంది.
credit: third party image reference
బైజుస్ బిజినెస్ మోడల్….
130 కోట్లకు పైగా ఉన్న భారతదేశ జనాభాలో దాదాపు 50% ప్రజలు 30 సంవత్సరాల లోపు వయస్సు వారు ఉన్నారు. అంటే 65 కోట్లకు పైగా జనాభా చదువుతున్నవారు లేదా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు ఉన్నారు. ఇంత భారీ సైజులో ఉన్న జనాభాకు అవసరమైన మౌలిక విద్యా సదుపాయాలు కల్పించే సరైన వ్యవస్థ మన భారతదేశంలో లేదు. అందుకే బైజుస్ లాంటి సంస్థలు మన దేశంలో బాగా ప్రజాదరణను పొందాయి. ప్రయివేట్ పాఠశాలలు వసూలు చేసే అధిక ఫీజుల చింతన లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తుంది బైజుస్. దాదాపు 800 మిలియన్ డాలర్ల పెట్టుబడిని వివిధ కంపెనీల నుండి సేకరించింది. ఇందులో చాన్ జూకర్ బర్గ్ ఇనిషియేటివ్స్, సికోయా క్యాపిటల్, సోఫినా, లైట్ స్పీడ్ వెంచర్స్ పార్ట్ నర్స్, వెర్ల్ ఇన్వెస్ట్, టైమ్స్ ఇంటర్నెట్, ఆరిన్ క్యాపిటల్ లాంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. సుమారు 4,000 మంది వరకు ఉద్యోగులతో 2018 ఆర్ధిక సంవత్సరానికి 1 బిలియన్ డాలర్ల ఆదాయంతో ‘ఇండియాస్ యునికార్న్ స్టార్టప్’ గా పేరు పొందింది.
బైజుస్ ప్రస్థానం….
credit: third party image reference
ఒక టీచర్ కొడుకు అయిన బైజు రవీంద్రన్ ఒక షిప్పింగ్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేసేవారు. వీకెండ్స్ మరియు సెలవు దినాల్లో స్నేహితులకు క్యాట్ ఎగ్జామ్స్ వ్రాసేందుకు సబ్జెక్ట్ లో సహాయపడేవారు. ఆ తరువాత పూర్తిస్థాయి ట్యూటర్ గా కొనసాగారు. 2011 లో బెంగుళూరు ప్రధాన కేంద్రంగా బైజుస్ ని స్థాపించారు. మొదటి దశలో K – to – 12 విద్యను అందించే ఆన్ లైన్ ప్లాట్ ఫాం ను రూపొందించారు. 2014 లో తన మొదటి ట్యాబ్లెట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ను కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వ్రాసేవారికి అనుకూలంగా ప్రవేశపెట్టారు. 2015 లో మొబైల్ అప్లికేషన్ రూపంలో పూర్తి స్థాయి లెర్నింగ్ యాప్ ను ప్రవేశ పెట్టారు. ఇది ప్రవేశపెట్టిన మొదటి మూడు నెలలకే 2 మిలియన్ల మంది విద్యార్ధులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. మంచి ఫలితాలు విద్యార్ధులకు ఇచ్చిన బైజుస్ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది.
బైజుస్ సాధించిన అవార్డులు కొన్ని…
• బిజినెస్ స్టాండర్డ్ అప్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2017)
• ఎక్స్ ప్రెస్ ఐటీ అవార్డులు – న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్ (2017)
• అమెజాన్ మొబిలిటీ అవార్డ్స్ విజేత (2017)
• CNBC TV 18 యంగ్ టర్క్స్ అఫ్ ది ఇయర్ అవార్డు విజేత (2017)
• డెలాయిట్ టెక్నాలజీ ఫాస్ట్ 50 ఇండియా మరియు ఫాస్ట్ 500 ఆసియా అవార్డు (2012, 2013, 2014, 2015, 2016, 2017)
• ఉత్తమ విద్యా అనువర్తనానికి Reimagine ఎడ్యుకేషన్ అవార్డ్స్ విజేత (2016)
• ‘బెస్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్ మెంట్’ యాప్ ఇన్ ఇండియా బై గూగుల్ ప్లే అవార్డ్ (2016)
• విన్నర్ ఆఫ్ VCCircle అవార్డ్ ఫర్ ఎడ్యుకేషన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ (2016)
• విన్నర్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవార్డ్ ఫర్ ఎడ్యుకేషన్ (2016)
• విన్నర్ ఆఫ్ గ్లోబల్ మొబైల్ అప్లికేషన్ అవార్డు (2016

No comments:

Post a Comment