Coffee Today

Tuesday, September 24, 2019

Health Tips

అయ్యబాబోయ్ బొప్పాయి పండు తింటే ఇంత బాగా పనిచేస్తుందా !తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
బొప్పాయిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఫ్రూట్ లో ఫాస్ఫరస్, కాపర్, పొటాషియం, ఐరన్, కేల్షియం, మ్యాంగనీజ్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు, విటమిన్ A, విటమిన్ Cమరియు విటమిన్ E, యాంటీఆక్సిడెంట్ లు, పీచుపదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయి పండు నుండి బీ కాంప్లెక్స్ విటమిన్స్ ను అలాగే పొటాషియం, కాపర్ మరియు మెగ్నీషియం వంటి మినరల్స్ ను పొందవచ్చు.
బొప్పాయి వలన కలిగే ప్రయోజనాలు :
*బొప్పాయి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
బొప్పాయిలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ ఫ్రూట్ ను భోజనం తరువాత తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. అలాగే, ఇందులో లభించే ఫైబర్ అనేది మలబద్దకాన్ని అరికడుతుంది.జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం మరియు రోగనిరోధకశక్తిని పెంపొందించడంతో పాటు చర్మానికి అలాగే శిరోజాలకు పోషణని అందించేందుకు బొప్పాయి ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
*విటమిన్ ఏ ను సమృద్ధిగా అందిస్తుంది.
బొప్పాయిని తీసుకోవడం వలన కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులో లభించే విటమిన్ ఏ అనేది కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్ ఇది. తద్వారా, కాటరాక్ట్ మరియు మ్యాక్యులర్ డీజెనెరేషన్ వంటి కంటి సమస్యలను అరికడుతుంది.
*బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. డెంగీ ఫీవర్‌తో బాధపడేవారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఫలితంగా ప్లేట్ లెట్స్ మళ్లీ వేగంగా పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగినా చక్కటి ఫలితం ఉంటుంది.
*బొప్పాయిలో పపైన్ మరియు కైమోపపైన్ అనే ఎంజైమ్స్ కలవు. ఇవి యాంటీ ఇంఫ్లేమేటరీ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి. అలాగే, ఇవి దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ ఎంజైమ్స్ అనేవి ర్యుమటాయిడ్ ఆర్తరైటిస్, ఎడెమా వంటి ఇతర ఇంఫ్లేమేషన్స్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి.
*బొప్పాయిలో క్యాలరీలు తక్కువే. అందువల్ల ఎక్కువగా తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు. పైగా... ఇది చెడు కొవ్వును తరిమేస్తుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది.

*మూత్ర పిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు. బొప్పాయి రెగ్యులర్‌గా తింటే, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు.
అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యల్ని బొప్పాయి తొలగిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి... బలం వస్తుంది.
*బొప్పాయి పండు నుండి బీ కాంప్లెక్స్ విటమిన్స్ ను అలాగే పొటాషియం, కాపర్ మరియు మెగ్నీషియం వంటి మినరల్స్ ను పొందవచ్చు. ఈ విటమిన్స్ మరియు మినరల్స్ అనేవి సెల్స్ యొక్క రీజెనెరేషన్ కు తోడ్పడతాయి. తద్వారా, ఫ్రీ రాడికల్స్ ద్వారా ఎదురయ్యే డేమేజ్ ను అరికడతాయి.
*కాన్సర్‌‌పై పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. ఇందులో బీటాకెరోటిన్‌, లూటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్‌ వైరస్‌తో పోరాడతాయి. ఇది కొలన్‌, గర్భాశయ కాన్సర్‌లను తగ్గిస్తుంది.
*బొప్పాయి అప్పుడప్పుడూ తింటూ ఉంటే... కళ్లు చల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి.బీపీ, షుగర్ ఉన్నవాళ్లు కూడా బొప్పాయి తింటే మంచిదే.
నారింజ, యాపిల్‌ కంటే బొప్పాయిలో విటమిన్‌ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మన స్కిన్ సున్నితంగా, మృదువుగా, కోమలంగా మారడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది.
*బొప్పాయి రుచిగా ఉంటుంది కదా అని మరీ ఎక్కువగా తినకూడదు. మితంగా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
బొప్పాయిని ప్రెగ్నెన్సీ ఉన్నవారు తినకూడదు.

No comments:

Post a Comment