Coffee Today

Friday, March 18, 2022

Bheemla Nayak OTT Release Date Confirm

Bheemla Nayak: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.!




భీమ్లా నాయక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన మల్టీస్టారర్‌ చిత్రమిది. ఇందులో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌ హీరోయిన్స్‌గా నటించారు. గత నెల 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుని భారీగా వసూళ్ళను రాబట్టింది. అయితే, ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. అని పవన్ కళ్యాణ్ అభిమనులతో పాటుగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి గుడ్‌న్యూస్ వచ్చింది. 

భీమ్లా నాయక్ మూవీ డిజిటల్ హక్కులను ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కొనుగోలు చూసేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రాన్ని మార్చి 25 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్టు తాజాగా ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. దాంతో థియేటర్స్‌లో ఆల్రెడీ చేసిన వారు..అక్కడ మిస్ అయినవారూ ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు - స్క్రీన్ ప్లే అందివ్వగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. థమన్ సంగీతం అందించాడు. 

No comments:

Post a Comment